తెలంగాణ రాష్ట్రంలో 2008 డీఎస్సీ అభ్యర్థులకు రేవంత్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. DSC 2008 అభ్యర్థుల గుర్తింపు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఉమ్మడి జిల్లాలకు పరిశీలకులను నియమించారు. అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ నవంబర్ 8వ తేదీలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్ణీత ప్రొఫార్మాలో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరైన అభ్యర్థుల జాబితాను సమర్పించాలని సూచించారు. డీఎస్సీ-2008 అభ్యర్థులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని డీఈవో కార్యాలయాల్లో దరఖాస్తులకు అవకాశం కల్పించారు. హైదరాబాద్ మినహా ఇతర జిల్లాల్లో పనిచేయాల్సి వస్తుందని చెబుతున్నారు.