బుల్లితెరపై యాంకర్ ప్రదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న టాప్ మేల్ యాంకర్స్‌లో ఈయన పేరు ముందుగా వినిపిస్తోంది. యాంకర్ ప్రదీప్ వరుస షోలు చేసి ఫుల్ క్రేజ్ సంపాదించుకుని ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ప్రదీప్ పెళ్లి గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే తాజాగా మరోసారి ప్రదీప్ పెళ్లి వార్త హాట్ టాపిక్ గా మారింది. ఓ రాజకీయ నాయకుడి కూతురితో పెళ్లి ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. యాంకర్ ప్రదీప్ ఏపీకి చెందిన ఓ ఎమ్మెల్యే కూతురుని రహస్యంగా ప్రేమిస్తున్నాడని ఇండస్ట్రీలో, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ అమ్మాయి తన చదువు కోసం ప్రేమ వ్యవహారాన్ని ఇన్ని రోజులు బయట పెట్టలేకపోయింది. ఇప్పుడు ప్రేమ విషయం ఇరు కుటుంబాలకు చెప్పి ఇద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయని.ఈ వార్తల్లో నిజం ఉందో లేదో తెలియదు గానీ.. ప్రదీప్ స్పందిస్తేనే క్లారిటీ వస్తుంది. అయితే ప్రదీప్ పెళ్లి కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు.