ఎన్నికల ముందు ప్రకటించినట్టుగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. గురువారం హైదరాబాద్లోని అశోక్ నగర్ లో సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఈ రాష్ట్రం కోరి కొట్లాడి తెచ్చుకున్నదే ఉద్యోగాల సాధన కోసం అని అన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు.