Homeహైదరాబాద్latest Newsనేడు భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నేడు భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలతో ముగిసాయి.సెన్సెక్స్ 836 పాయింట్లు నష్టపోయి 79,541 వద్ద ముగియగా… నిఫ్టీ 284 పాయింట్లు కోల్పోయి 24,199 వద్ద స్థిరపడింది. నిఫ్టీ బ్యాంక్ 400 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్-100 ఇండెక్స్ 247 పాయింట్లు, నిఫ్టీ స్మాల్ క్యాప్-100 ఇండెక్స్ 143 పాయింట్లు నష్టపోయాయి.

ఐటీ, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, ప్రైవేట్‌ బ్యాంకులు, కమోడిటీ, పీఎస్‌ఈ, హెల్త్‌కేర్‌ రంగాలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్-30 ప్యాక్‌లో టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, అల్ట్రా టెక్ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సన్ ఫార్మా, ఏషియన్ పెయింట్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టైటాన్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్ టాప్ లూజర్‌గా ఉన్నాయి. ఎస్‌బీఐ టాప్ గెయినర్‌గా నిలిచింది.

Recent

- Advertisment -spot_img