Homeహైదరాబాద్latest Newsనటి కస్తూరికి మద్రాసు హైకోర్టు షాక్.. ముందస్తు బెయిల్ కు చుకెదురు

నటి కస్తూరికి మద్రాసు హైకోర్టు షాక్.. ముందస్తు బెయిల్ కు చుకెదురు

నటి కస్తూరికి మద్రాసు హైకోర్టు షాకిచ్చింది. ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఇటీవల తెలుగుజాతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఆమె బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఈ నెల 3న చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో నటి కస్తూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తమిళ రాజులకు సేవ చేసేందుకు వచ్చిన వారు తెలుగువారేనంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమెకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ఆమె ఇంటికి వెళ్లారు. ఫోన్‌ స్విచ్ఛాప్‌ ఉండడంతో పరారీలో ఉన్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు. అదే సమయంలో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఆమె ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే కోర్టు ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది.

Recent

- Advertisment -spot_img