రాష్ట్రంలో ఎవరు తిరుగుబాటు చేసినా అది బీఆర్ఎస్ కుట్రనేనా? అని హరీష్ రావు ప్రశ్నించారు. పోరాటం చేస్తున్న ప్రజల పక్షాన నిలబడడం ప్రతిపక్షంగా మా బాధ్యత అని తెలిపారు. మాకు ఉద్యమాలు కొత్త కాదు, అరెస్టులు కొత్త కాదు, జైళ్ళు కొత్త కాదు అని మండిపడ్డారు. నువ్వెన్ని అక్రమ కేసులు పెట్టినా సరే మేము ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నిస్తూనే ఉంటాం అని అన్నారు.పేదల కడుపు కొట్టడానికే ముఖ్యమంత్రిగా ఉన్నావా అని రేవంత్ రెడ్డిని హరీష్ రావు నిలదీశారు. మా భూముల మాకు కావాలని లగచర్ల గ్రామ ప్రజలు కొన్ని నెలలుగా పోరాటం చేస్తున్నారు అని తెలిపారు. ఆ ప్రాంత ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ పిలిచి మాట్లాడకుండా గూండాలతో, పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నాడు అని ఆరోపించారు. ఓటు వేసి గెలిపించినందుకు ఆ రైతుల నోట్లో మట్టికొట్టాడు అని హరీష్ రావు నిలదీశారు.