విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఐఐటి మద్రాసు, ప్రభుత్వ ప్రతినిధుల నడుమ కీలక ఒప్పందాలు జరిగాయి. రాష్ట్ర ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో 8 విభాగాలు ఒప్పందం చేసుకున్నాయి. రాష్ట్రాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు, అధునాతన సాంకేతికత, పరిశోధన ఫలితాలను ఏపీ ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం మద్రాస్ ఐఐటీతో ఒప్పందం కుదుర్చుకుంది.ఏపీ సీఆర్డీఏ, మ్యారీ టైం బోర్డు, స్కిల్ డెవలప్ మెంట్, విద్య, ఇన్వెస్టిమెంట్ & ఇన్ ఫ్రా స్ట్రక్చర్, ఐటి, ఆర్టీజిఎస్ శాఖలతో ఐఐటి మద్రాస్ ఒప్పందాలు కుదిరాయి.