Homeవిచిత్రంSay Your Story and get 10 rupees gift : మీ కథ చెప్పండి.....

Say Your Story and get 10 rupees gift : మీ కథ చెప్పండి.. రూ.10 తీసుకోండి..

Say Your Story and get 10 rupees gift : మీ కథ చెప్పండి.. రూ.10 తీసుకోండి.. మీ కథ చెప్పి రూ.10 తీసుకోండని ఓ 22 ఏండ్ల పుణె యువుకుడు ఓ సామాజిక ఉద్యమానికి పురుడు పోశాడు.

పూణె ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ టెక్నాలజీలో చదువుతున్న నాగ్‌పూర్‌కు చెందిన రాజ్‌ ధగ్‌వర్‌ సామాజిక చైతన్యం తెచ్చే ఏదైనా కార్యక్రమం చేపట్టాలని ఆలోచన చేశాడు.

అమెరికాకు చెందిన అలెస్సాండ్రో చేపట్టిన ఓ వినూత్న కార్యక్రమం ‘టెల్‌ యువర్‌ స్టోరీ’ రాజ్‌ను ఆకర్షించింది.

దీంతో ఆ కార్యక్రమాన్ని ఇండియాలో చేపట్టాలనుకున్నాడు.

ప్రజల్లో ఎలాంటి ‍స్పందన వస్తుందో చూడాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఓ ప్లకార్డు తయారు చేసి చేతపట్టుకోని వీధుల్లో నిలబడటం మొదలెట్టాడు.

ప్లకార్డుపై ‘ మీ కథ నాకు చెబితే 10రూపాయలు ఇస్తాను’ అని రాశాడు. ప్రతిరోజు ఫర్గుసన్‌ కాలేజ్‌ రోడ్‌లో ప్లకార్డు పట్టుకుని నిలబడేవాడు.

జనం అతడి దగ్గరకు వచ్చి మాట్లాడేవారు. తక్కువ సమయంలో రాజ్‌ సోషల్‌ మీడియా సెలెబ్రిటీ అయిపోయాడు.

‘‘ నేను మొదటిరోజు ఉదయం 8నుంచి రాత్రి 11.30 వరకు ఎఫ్‌సీ రోడ్‌లో నిలుచున్నాను. పెద్దగా స్పందన వస్తుందనుకోలేదు.

అయితే చాలా మంది నా దగ్గరకు వచ్చేవారు.’’ అంటూ రాజ్ పేర్కొన్నాడు.

‘‘నేను విన్న కథల్లో బాగా నచ్చిన కథంటే ఓ వ్యక్తి తన 22 ఏళ్ల వయసులో తాగుడు మానటానికి పోరాడటం.

ఆ వ్యక్తి ప్రేమ విఫలమవ్వటంతో తాగుడుకు బానిసయ్యాడు. ప్రతీరోజు తాగేవాడు. అది చూడలేక అతడి తండ్రి మరణించాడు.

దీంతో అతడిపై అతడికి అసహ్యం వేసింది. ఎలాగైనా తాగుడు మానుకోవాలనుకున్నాడు.

థెరపీకి వెళ్లి తాగుడు అలవాటు మానుకున్నాడు.’’ రాజ్ గుర్తు చేసుకున్నాడు.

ఈ క్యాంపెయిన్ లక్ష్యం గురించి వివరిస్తూ.. ‘‘నేను పది రూపాయలు ఇచ్చిన తర్వాత ఆ డబ్బుల్ని వేరే వారికి ఇవ్వమని చెబుతున్నాను.

ఎందుకంటే అలాగైనా మానవత్వం ముందుకు పోతుందని భావిస్తున్నారు.

మన కథలు వినటానికి ఏవరైనా ఒకరు కచ్చితంగా ఉండాలని నేను నమ్ముతాను.

ఓ రోజు నా‌ వీడియోను చూసిన దుబాయ్‌లోని అమ్మానాన్నలు ఆశ్చర్యపోయారు’’ అని అన్నాడు.

Recent

- Advertisment -spot_img