కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కేసీఆర్ ఆదేశాల మేరకే కిషన్ రెడ్డి మూసీ నిద్ర చేపట్టారని పొన్నం ప్రభాకర్ అన్నారు. కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా తెచ్చే శక్తి మీకు లేదని పొన్నం ప్రభాకర్ నిలదీశారు. కిషన్ రెడ్డి నువ్వు తెలంగాణా రాష్ట్ర బిడ్డేనా..? DNA టెస్టు చేయించుకో అని ప్రభాకర్ అన్నారు. తెలంగాణ రాత్స్ర బిల్లు ఎలా పాస్ అయ్యిందో నీకు తెలియదా అని నిలదీశారు. కలెక్టర్‌పై దాడి ఘటన న్యాయమా అని ప్రశ్నించారు. కలెక్టర్‌ను కొట్టిన వారికి మద్దతు పలికిన నీకు కేంద్ర మంత్రిగా ఉండే అర్హత ఉందా అని ప్రశ్నించారు. దమ్మంటే బహిరంగ చర్చకు రావాలని పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. కలెక్టర్ పై దాడి జరిగితే దానిని ఖండించకుండా సమర్థించడం దారుణమని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. నిధులు రాబట్టుకోలేని బీజేపీ నేతలు మూసీ వద్దకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. మూసీ కాలువ వాసన చూసినా దైవసాక్షులుగా నిజాలు చెబుతారని భావిస్తున్నానన్నారు.