Homeహైదరాబాద్latest Newsప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఇంట్లో మొదలైన పెళ్లి సందడి..!

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఇంట్లో మొదలైన పెళ్లి సందడి..!

ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. కీరవాణి చిన్న కొడుకు శ్రీసింహ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. ప్రముఖ నటుడు మురళీ మోహన్ తన మనవరాలు రాగ మాగంటిని శ్రీసింహ పెళ్లి చేసుకోనున్నారు.ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని గోల్కొండ రిసార్ట్స్‌లో ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరిగాయి. మురళీ మోహన్ తన మనవరాలి పెళ్లి సందర్భంగా ఈ ప్రీ వెడ్డింగ్ పార్టీని నిర్వహించారు. ఈ పార్టీకి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వారిలో స్టార్ హీరో మహేష్ బాబు, సితార, నరేష్, పవిత్ర లోకేష్ తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కీరవాణి కొడుకు శ్రీసింహ ‘మ‌త్తు వ‌ద‌ల‌రా’, ‘మ‌త్తు వ‌ద‌ల‌రా 2’ అనే సినిమాల్లో హీరోగా నటించాడు.

Recent

- Advertisment -spot_img