తెలగాం సీఎం రేవంత్ రెడ్డికి ఖబర్దార్ అంటూ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక ఇచ్చారు. ఇప్పుడు అక్కడ ఎన్నికలు లేవు-మరి ఈ పోలీసుల లాంగ్ మార్చ్ ఏంటి?.. అక్కడ గొడవలు ఏం జరగలేదు ? మరి పోలీసుల హెచ్చరికలు ఎందుకు?.. అసలు మహబూబాబాద్ జిల్లా మానుకోటలో ఏం జరుగుతుంది ? అని కేటీఆర్ ప్రశ్నించారు. శాంతియుతంగా సభ నిర్వహించుకుంటామంటే అవకాశం కూడా ఇవ్వని దుస్థితి ఎందుకు వచ్చింది ?.. ఇది ప్రజాపాలన ఎలా అవుతుంది ? అని నిలదీశారు. ఇది ముమ్మాటికీ నిర్బంధ పాలన, నిరంకుశ పాలన, కంచెల పాలన, కక్ష్యల పాలన, ఆంక్షల పాలన.. మొత్తంగా రాక్షస పాలన అని ఆరోపించారు. ఖబర్దార్ రేవంత్ ఇది తెలంగాణ. ఎంత అణచివేస్తే అంత తిరుగుబాటు వస్తుంది అని కేటీఆర్ హెచ్చరించారు.