మేషం:
ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. పనులు విజయవంతమవుతాయి. అందాల్సిన సొమ్ము అందుతుంది. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారులకు కలసివస్తుంది. ఒత్తిడులు పెరుగుతాయి. పొదుపును పాటించండి. రాజకీయనాయకులకు అనుకూలం. కళాకారులకు గుర్తింపు లభిస్తుంది.
వృషభం:
పనుల్లో పురోగతి కనిపిస్తుంది. వ్యయ సూచన. మాటలపై అదుపు అవసరం. యుక్తితో అనుకున్నది సాధించగలరు. వాహన యోగం ఉంది. శుభకార్య యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు పై అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. చేసిన పనికి గుర్తింపు లభిస్తుంది.
మిథునం:
సంఘంలో గుర్తింపు లభిస్తుంది. సమయానికి సొమ్ము చేతికి అందుతుంది. అవసరాలు గట్టెక్కుతాయి. ఖర్చును అదుపు చేసుకోవాలి. వ్యాపారులకు లాభసూచన. వ్యయప్రయాసలు అధికం. కుటుంబసభ్యుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగులు ప్రశంసలు అందుకుంటారు.
కర్కాటకం:
ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఆహారవిహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. మాట తూలవద్దు. ఓర్పుతో సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఆర్థిక సమస్యల పరిష్కారానికి మీరు చేపట్టిన చర్యలు ఫలితాన్ని ఇస్తాయి. స్థిరాస్తి కొనుగోలు యత్నాలు చేస్తారు. అప్రమత్తంగా ఉండాలి.
సింహం:
శుభసమాచారం అందుకుంటారు. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. భూములు కొనుగోలు యత్నం చేస్తారు. వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగులకు అనుకూలమైన రోజు. కొత్తవారితో పరిచయాలు కలుగుతాయి. రాజకీయ వేత్తలకు కలసివస్తుంది. కళాకారులు, క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.
కన్య:
బంధుమిత్రులతో వివాదాలు తలెత్తవచ్చు. ఓర్పుగా ఉండండి. మాట అదుపులో ఉంచుకోండి. శుభకార్య యత్నాలు చేస్తారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. సమస్యలు తీరతాయి. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది.
తుల:
అనుకూలమైన రోజు. సమస్యలు తీరతాయి. సొమ్ము చేతికి అందుతుంది. వ్యాపారులకు లాభ సూచన. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. నిరుద్యోగులకు అనుకూలమైన సమాచారం అందుతుంది. రాజకీయనాయకులకు గుర్తింపు లభిస్తుంది.
వృశ్చికం:
ధనవ్యయం ఎక్కువవుతుంది. ఖర్చు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. సమయానికి సొమ్ము అందకపోవచ్చు. పదోన్నతులు లభించవచ్చు. కొత్త వారితో పరిచయం మేలు కలిగిస్తుంది. వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి.
ధనుస్సు:
ప్రోత్సాహకరంగా ఉంటుంది. పనులు చకచకా పూర్తవుతాయి. రావలసిన సొమ్ము అందుతుంది. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులు కొత్తబాధ్యతలు స్వీకరిస్తారు. కొత్త పెట్టుబడులు పెడతారు. ఆచితూచి అడుగు వేయండి. మాట అదుపు అవసరం.
మకరం:
ఆటంకాలు ఎదురవుతాయి. ఓర్మితో పనులు పూర్తి చేసుకోవాలి. ఆత్మవిశ్వాసం వదులుకోవద్దు. ఉద్యోగులపై ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారుల లాభాలు తగ్గే సూచన. రాజకీయనాయకులు, కళాకారులు ఊహించనివి చోటు చేసుకుంటాయి. విద్యార్థులకు ఇబ్బందులు ఎదుర్కొంటారు.
కుంభం:
వివాదాలు తలెత్తవచ్చు. ఓర్పుతో వ్యవహరించాలి. మాట అదుపులో ఉంచుకోవాలి. ఉద్యోగులకు మార్పులు జరుగుతాయి. అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. జాగ్రత్తలు పాటించాలి. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వాహన కొనుగోలు యత్నం చేస్తారు.
మీనం:
కొత్తవారితో పరిచయాలు కలుగుతాయి. అనుకున్నట్టుగా ధనం చేతికందుతుంది. అనారోగ్య సూచన. బాల్యమిత్రులను కలుస్తారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రోత్సాహం లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశం. బాధ్యతలు సక్రమంగా నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు.