ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా ‘పుష్ప 2’.ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రష్మిక మందాన హీరోయినిగా నటించింది.ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న రిలీజ్ కాబోతుంది.ఈ సినిమా విడుదలకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ‘పుష్ప 2′ సినిమా ఒక వారం వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాలేదని, అందుకే ఈ సినిమాని విడుదల చేయడానికి చిత్రబృందం ఆలోచనలో ఉన్నారని టాక్ నడుస్తుంది.’పుష్ప 2’ వాయిదా పడుతుందనే వార్తలపై స్పందించిన చిత్ర బృందం.. ఈ సినిమా వాయిదా పడలేదు అని ప్రకటించారు. దీనికి సంబంధించిన ఓకే పోస్ట్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ సినిమా డిసెంబర్ 5న వస్తుంది అని కన్ఫర్మ్ చేసారు.