కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచిన ప్రియాంక గాంధీ ఈ ఫలితాల్లో జోరు చూపిస్తున్నారు. ప్రస్తుతం రెండు లక్షల ఓట్లకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సీపీఐ అభ్యర్థి సత్యన్ మొకేరి ద్వితీయం స్థానంలో ఉండగా.. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ మూడో స్థానానికే పరిమితమయ్యారు. కాగా.. ప్రియాంకాగాంధీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల పోటీలో ఉండటం విశేషం.