ఐపీఎల్ వేలంలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ భారీ ధర దక్కించుకున్నాడు. అతడి కోసం పంజాబ్, లక్నో పోటీ పడ్డాయి. చివరకు రూ.8 కోట్లకు లక్నో అతడిని సొంతం చేసుకుంది.
అలాగే భారత పేసర్ ముకేశ్ కుమార్‌ను రూ.8 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ముకేశ్ కోసం చెన్నై, పంజాబ్ ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. చివరకు ఆర్‌టీఎమ్ కార్డు ఉపయోగించి ఢిల్లీ అతడిని సొంతం చేసుకుంది. అతడు కనీస ధర రూ.2 కోట్లు కాగా ఢిల్లీ రూ.8 కోట్లు వెచ్చించి దక్కించుకుంది.
అలాగే భారత పేసర్ తుషార్ దేశ్‌పాండేను రూ.6.50 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ దక్కించుకుంది. తుషార్ కనీస ధర రూ.కోటి కాగా అతడిని కొనుగోలు చేసేందుకు పలు ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. గతంలో చెన్నై తరఫున ఆడిన తుషార్ మంచి బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 36 మ్యాచ్‌లు ఆడిన తుషార్ 42 వికెట్లు తీశాడు.