అదానీ ఫ్రాడ్ అని సీఎం రేవంత్ రెడ్డికి నిన్ననే తెలిసిందా అని కేటీఆర్ నిలదీశారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో అదానీని గజదొంగ అంటివి. మహారాష్ట్రలో గజదొంగ తెలంగాణ రాష్ట్రంలో సుద్దపూస అయ్యిండా? అని కేటీఆర్ ప్రశ్నించారు. నేను ఏదో అదానీని రహస్యంగా కలిసినట్లు ఒక ఫోటో చూపిస్తున్నాడు సీఎం రేవంత్ అది నా ట్విట్టర్ అకౌంట్లో నేనే పెట్టాను అని కేటీఆర్ అన్నారు. నీలాగా కోహినూర్ హోటల్లో 4 గంటలు వారిని కలిసి వాళ్ళ కాళ్ళు పట్టుకోలేదు అని అన్నారు. అదానీ ఒక ప్రపోజల్ ఇచ్చాడు, కేసీఆర్ దాన్ని రిజెక్ట్ చేశారు అంతే.. మా ప్రభుత్వం హయాంలో అదానీకి రెడ్ సిగ్నల్ ఇచ్చం.. అయితే రేవంత్ రెడ్డి ఇప్పుడు అదానీకి రెడ్ కార్పెట్ పరుస్తున్నాడు అని కేటీఆర్ ఆరోపించారు.