Homeహైదరాబాద్latest Newsయూపీలో జామా మసీదు-హరిహర ఆలయం వివాదం..! అసలు ఏమి జరిగిందంటే..?

యూపీలో జామా మసీదు-హరిహర ఆలయం వివాదం..! అసలు ఏమి జరిగిందంటే..?

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో ఆదివారం జరిగిన హింసాత్మక ఘర్షణలు నలుగురు మృతి చెందడంతో ఉద్రిక్తంగా మారింది. షాహీ జామా మసీదులో కోర్టు ఆదేశించిన సర్వేకు పెద్ద ఎత్తున ప్రజలు ప్రతిఘటించడంతో అశాంతి నెలకొంది. 16వ శతాబ్దానికి చెందిన మసీదు ఉన్న ప్రదేశంలో ముందుగా ఆలయం ఉందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై స్థానిక కోర్టు ఆదేశాల మేరకు, సర్వే చేసేందుకు అడ్వకేట్ కమిషన్ వచ్చిన నవంబర్ 19 నుంచి ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఆదివారం రెండవ రౌండ్ సర్వే కోసం కమిషన్ వచ్చినప్పుడు, ఈ చర్యను వ్యతిరేకిస్తూ వందలాది మంది నిరసనకారులు సంఘటన స్థలంలో చేరారు. పోలీసులతో వారితో ఘర్షణకు దారితీసింది. అయితే 1529లో మొఘల్ పాలకుడు బాబర్ కూల్చివేసిన చారిత్రక హరిహర మందిరం ఉన్న ప్రదేశంలో ప్రస్తుత షాహీ మసీదు ఉందని ఆరోపిస్తూ సుప్రీం కోర్టు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ దాఖలు చేసిన ఫిర్యాదుతో ఈ వివాదం ఏర్పడింది. ఈ ప్రాంతంలోని హరిహర ఆలయం గురించి అనేక మత గ్రంథాలలో ప్రస్తావించబడింది. సంభాల్ పౌరాణిక చరిత్ర కలిగిన ప్రదేశమని.. అలాగే నహుష రాజు కుమారుడు యయాతి ఇక్కడ హరిహర ఆలయాన్ని నిర్మించారు అని సీనియర్ చరిత్రకారుడు డా. అజయ్ అనుపమ్‌ అన్నారు.

Recent

- Advertisment -spot_img