Homeహైదరాబాద్latest Newsరైతులను అధికారంలోకి వచ్చాక నిండా ముంచావు..! సీఎం రేవంత్ పై హరీష్ రావు ఫైర్

రైతులను అధికారంలోకి వచ్చాక నిండా ముంచావు..! సీఎం రేవంత్ పై హరీష్ రావు ఫైర్

ఏడాది పాలనలో రైతులను విజయవంతంగా దగా చేసినందుకు రైతు పండుగ అంటూ మూడు రోజుల విజయోత్సవాలు చేస్తున్నావా రేవంత్ రెడ్డి ? అని బిఆర్ఎస్ నేత హరీష్ రావు ప్రశ్నించారు. గొప్పగా చెప్పిన వరంగల్ రైతు డిక్లరేషన్ లోని 9 హామీల్లో ఒక్కటీ అమలు చేయనందుకు పండుగ చేస్తున్నావా రేవంత్ రెడ్డి?.. రుణమాఫీ ఎగ్గొట్టి, రైతు భరోసా బోగస్ చేసి, కనీస మద్దతు ధరకు పంట కొనుగోలు చేయకుండా రైతులను ఏడ్పిస్తున్నందుకు చేస్తున్నావా.. మీ ఏడాది దుర్మార్గ పాలనలో 563 మంది రైతులు ప్రాణాలు కోల్పోయినందుకు పండుగ చేస్తున్నావా రేవంత్ రెడ్డి అని నిలదీశారు. చెప్పింది కొండంత, చేసింది గోరంత. ఎన్నికల ప్రచారంలో రైతులను మభ్య పెట్టావు. అధికారంలోకి వచ్చాక నిండా ముంచావు అని ఆరోపించారు. నూటొక్క దేవుళ్ల మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేస్తానని మోసం చేశారు. సగం మందికి మొండి చెయ్యి చూపారు అని అన్నారు. మీకు, మీ పార్టీకి రైతుల సంక్షేమం పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. రైతులకు బాకీ పడ్డ రూ. 40,800 కోట్లతో పాటు, ఈ రబీకి ఇవ్వాల్సిన రైతు భరోసా కూడా వెంటనే విడుదల చేసి పండుగ చేసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేసారు.

Recent

- Advertisment -spot_img