Homeహైదరాబాద్latest Newsమాజీ ఎమ్మెల్యే యూటర్న్.. తిరిగి బీఆర్ఎస్ గూటికి..?

మాజీ ఎమ్మెల్యే యూటర్న్.. తిరిగి బీఆర్ఎస్ గూటికి..?

పదేళ్ల పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగి, లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ యూటర్న్ తీసుకోబోతున్నారన్న చర్చ జరుగుతోంది. కాషాయ పార్టీకి గుడ్ బై చెప్పి తిరిగి కారెక్కేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీ నుంచి లోక్ సభ బరిలో నిలిచిన ఆరూరి ఆ ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదు. దీంతో పార్టీ మారతారన్న ప్రచారం ఊపందుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ గులాబీ గూటికి చేరనున్నట్లు టాక్.

Recent

- Advertisment -spot_img