ప్రధాని నరేంద్ర మోదీని బెదిరిస్తూ ఫోన్ కాల్ వచ్చింది. ముంబయి ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ కు గురువారం దుండగులు ఫోన్ చేసి హెచ్చరించారు. ప్రధాని మోదీని హత్య చేసేందుకు ప్లాన్ చేసినట్లు.. అందుకు ఓ ఆయుధాన్ని సైతం సిద్ధం చేసుకున్నట్లు వెల్లడించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ కాల్ ను ట్రాక్ చేయగా.. ఓ మహిళ (34) ఆ ఫోన్ చేసినట్లు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.