ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయినిగా నటించిన సినిమా ‘పుష్ప 2’. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్ర బృందం పలు ప్రధాన నగరాలకు వెళ్లి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఈ క్రమంలో పాట్నా, చెన్నై, కోచి ప్రాంతాలలో ఇప్పటికే ప్రమోషన్స్ నిర్వహించారు.
కాగా, జనవరి 4న రాజమండ్రిలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నారు.అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాల్సిందిగా అల్లు అర్జున్ స్వయంగా పవన్ కళ్యాణ్‌ను పిల్వనునట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. మరి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వస్తారో లేదా చూడాలి. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.