వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రైతు భరోసా అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జనవరిలో ఎకరానికి రూ.7,500 చొప్పున యాసంగి సాగుకు సాయం అందించనుంది. ఈ మేరకు వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి రైతు భరోసా విధివిధానాలను ఖరారు చేయనున్నట్లు సమాచారం. గుట్టలు, కొండలు ఉన్న భూములతో పాటు స్థిరాస్తి వెంచర్లుగా మారిన ల్యాండ్‌కు రైతుభరోసా నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది.