ఏపీ సీఎం చంద్రబాబు ప్రభుత్వంపై వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు.సీఎం చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాధాకరమైన పరిస్థితులు నెలకొన్నాయని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. వైసీపీ హయాంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని జగన్ తెలిపారు. ప్రతి ఇంటికి వైసీపీ ప్రబుత్వం మంచి చేశామన్నారు. కూటమి పాలనలో ప్రగతి వెనక్కు పోతుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా పేకాట క్లబ్బులు కనిపిస్తున్నాయని జగన్ అన్నారు. సీఎం చంద్రబాబు, ఆయన సోషల్ మీడియా నాపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు అని జగన్ అన్నారు.