పుష్ప-2 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతుండగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే పాట్నా, చెన్నై, కొచ్చిలో ప్రమోషన్స్ పూర్తయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నవంబర్ 30న చిత్తూరులో నిర్వహించనున్నట్లు వార్తలు రాగా తాజాగా హైదరాబాద్‌లోనే జరగనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 1 మల్లారెడ్డి కాలేజీలో ఈవెంట్ జరగనుందట. దీనిపై నేడు క్లారిటీ రానుంది.