తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, SIB మాజీ OSD ప్రభాకర్ రావు అమెరికా ప్రభుత్వానికి మొర పెట్టుకున్నారు. తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వానికి ఆయన వినతిపత్రం అందించారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి ఫ్లోరిడాలో తన కుమారుడు వద్ద ఉంటున్నానని పేర్కొన్నారు.