తెలంగాణ సీఎం రేవంత్ పై బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. పండిన పంట ఎంత ? కొన్న ధాన్యం ఎంత?అందులో బోనస్ రూ.500 ఇచ్చింది ఎంత ధాన్యానికి.. అని కేటీఆర్ ప్రశ్నించారు. 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తే 5,19,605 క్వింటాళ్ల సన్న వడ్లను క్వింటాలుకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేసినట్లు నీవే చెబుతున్నావు అని అన్నారు. ఇదే నిజం అనుకున్నా ..ఈ లెక్కన రైతులకు దక్కిన బోనస్ రూ.25.98 కోట్లు రైతుభరోసా కింద ఎకరానికి ఏడాదికి రూ.15 వేల చొప్పున రైతన్నలకు కోటి 50 లక్షల ఎకరాలకు ఇప్పటి వరకు ఎగ్గొట్టిన మొత్తం ఎంత ? అని నిలదీశారు. కౌలు రైతులకు ఎకరాకు రూ.15 వేల చొప్పున ఎగ్గొట్టిన మొత్తం ఎంత.. రైతుకూలీలకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఎగ్గొట్టిన మొత్తం ఎంత అని కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాని ప్రశ్నించారు. కొన్నది పిసరంత కోతలు కొండంత అని చురకలు అంటించారు. పండగలాంటి వ్యవసాయం.. ఏడాది కాంగ్రెస్ పాలనలో మళ్లీ దండగగా మారింది అని కేటీఆర్ ఆరోపించారు.