బార్లీ నీటితో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బార్లీ నీటిలో కాల్షియం, ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, జింక్, కాపర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. బార్లీ నీళ్లు రెగ్యులర్గా తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది. మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. కిడ్నీలో రాళ్లు, ఇన్ఫెక్షన్ ప్రమాదాల నుంచి కాపాడుతుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ముఖ్యంగా రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.