హైదరాబాద్ లో పెండింగ్లో ఉన్న నీటి బిల్లుల చెల్లింపునకు వన్ టైమ్ సెటిల్మెంట్-2024 పథకం శనివారంతో ముగియనుంది. బిల్లు మొత్తం కడితే ఎలాంటి వడ్డీ, ఆలస్య రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. గడువు పూర్తయిన తర్వాత చెల్లిస్తే వడ్డీతో పాటు పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. లేనిపక్షంలో రేపటి నుంచి చర్యలు తీసుకుంటామని హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ ట్వీట్ చేసింది. అవసరమైతే నల్లా కనెక్షన్ సైతం తొలగిస్తామని స్పష్టం చేసింది.