తెలంగాణలో రూ.2 లక్షల వరకు రుణాలు ఉన్న రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నేడు మహబూబ్ నగర్‌లో నిర్వహించిన రైతు సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి నాలుగో విడత రుణమాఫీ నిధులు విడుదల చేశారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.2747.67 కోట్లు విడుదల చేసింది. అలాగే సీఎం రేవంత్ చేతుల మీదుగా కొందరి రైతులకు చెక్కులు పంపిణీ చేశారు. డిసెంబర్ మొదటి వారంలో జీతాలు, పింఛన్లు చెల్లించిన తర్వాత రైతుల ఖాతాల్లో మాఫీ సొమ్మును జమ చేసేలా ప్లాన్ చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 22 లక్షల మంది రైతులకు రూ.17,869 కోట్లు మాఫీ కాగా.. కొన్ని కారణాలతో 4 లక్షల మందికి మాఫీ కాలేదు.