వరుణ్ తేజ్ హీరోగా నటించిన సినిమా ‘మట్కా’. ఈ సినిమాకి కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో వరుణ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా భారీ అంచనాలు మధ్య నవంబర్ 14న థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ సినిమాకి ప్లాప్ టాక్ రావడంతో డిజాస్టరుగా నిలిచింది. తాజాగా ఈ సినిమా ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సినిమా ప్రముఖ ఓటిటి సంస్థ ‘అమెజాన్ ప్రైమ్’ లో డిసెంబరు 5 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో వైరా ఎంటర్టైన్మెంట్స్, ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు నిర్మించాయి.