తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు లక్ష రుణమాఫీ చేస్తామని నాలుగు దశలో కూడా చేయలేకపోయారు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. రాష్ట్రంలో గత ప్రభుత్వంలో రుణమాఫీ వడ్డీ పెరిగిపోయింది అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 15 రోజుల్లోనే 18 వేల కోట్ల రుణమాఫీ చేసింది అని తెలిపారు. రుణమాఫీ చేయకుండా మీలాగా తప్పించుకుని పోలేదు అని చురకలు అంటించారు. స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ ఎవరూ చేయలేదు అని భట్టి విక్రమార్క తెలిపారు. ఏడాది కాకముందే వేల కోట్ల రూపాయలు రైతులకు కేటాయించాం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.