Homeహైదరాబాద్latest Newsతెలంగాణకు వర్షం ముప్పు.. వాతావరణ శాఖ ఏమంటుందంటే..?

తెలంగాణకు వర్షం ముప్పు.. వాతావరణ శాఖ ఏమంటుందంటే..?

అరేబియా సముద్రంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీంతో తెలంగాణలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అది మరో రెండు రోజులు ఉంటుంది. ఆ తర్వాత బలహీనపడుతుంది. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఉంటాయని భారత వాతావరణ శాఖ చెప్పలేదు. ఐతే.. తెలంగాణలో ఇవాళ, రేపు మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ అధికారులు తెలిపారు. శాటిలైట్ లైవ్ అంచనాల ప్రకారం.. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో రోజంతా మేఘాలు వస్తూ, పోతూ ఉంటాయి. ఉదయం 11 తర్వాత రాయలసీమ, ఉత్తర తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మొదలవుతాయి. ఆ తర్వాత సాయంత్రం వరకూ కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయి. మొత్తంగా ఇవాళ రెండు రాష్ట్రాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Recent

- Advertisment -spot_img