తెలంగాణలో గత కొద్ది రోజులుగా పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసాయి. తాజాగా మరో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలోకి కింది స్థాయి గాలులు ప్రధానంగా తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్నట్లు వెల్లడించింది. వచ్చే వారం రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండబోదని వాతావరణ శాఖ తెలిపింది. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన సమయంలోనూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. హైదరాబాద్ నగరంలోని చాలా చోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి.