క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా నటించిన సినిమా ‘పుష్ప2’. ఈ సినిమా విడుదలై రికార్డులు బద్దలుకొడుతుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 294 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది. తాజాగా ఈ సినిమాని చూసిన ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామిసంచలన వ్యాఖ్యలు చేసారు. సోషల్ మీడియా ద్వారా సినిమాపై తన అభిప్రాయాలను వీడియో రూపంలో పంచుకున్నారు. ఈ సినిమాలో జాతర సీక్వెన్స్ లో అమ్మవారి గెటప్‌లో అల్లు అర్జున్ చేసిన నటన బాగుంది అని పేర్కొన్నారు. అల్లు అర్జున్ నిజమైన సూపర్ స్టార్ అని వేణు స్వామి కొనియాడారు. ఈ సందర్భంగా తాను గతంలో పలు చానెళ్లకు అల్లుఅర్జున్ గురించి తాను చేసిన వ్యాఖ్యలను ఈ వీడియోలో చూపించారు. అల్లు అర్జున్ నిజమైన పాన్ ఇండియా స్టార్. ఆయన సినిమాలు వందల కోట్లు వసూలు చేస్తున్నాయి. మరో 15 ఏళ్ల వరకు ఇండస్ట్రీలో తిరుగులేదు అని అన్నారు. బన్నీతో సినిమా తీస్తే నిర్మాతలెవరూ నష్టపోరని వేణు స్వామి అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.