హైదరాబాద్‌లోని సైబరాబాద్ కమిషనరేట్ అనగానే ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చేది ఐటీ కారిడార్. రోజుకు సుమారు 15–20 లక్షల మంది వాహనదారులు రాకపోకలు సాగించే అత్యధిక రద్దీ ప్రాంతం.. అలాంటి ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టడానికి సైబరాబాద్ పోలీసులు అనేక కార్యక్రమాలను చేపడుతున్నారు. తాజాగా ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉన్న, అత్యధికంగా వాహనాల రాకపోకలు సాగించే ముఖ్యమైన జంక్షన్‌ల వద్ద సిగ్నల్ ఫ్రీ, ట్రాఫిక్ ఫ్రీ జంక్షన్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.