Homeహైదరాబాద్latest Newsనేషనల్ కాదు ఇంటర్నేషనల్.. హాలీవుడ్ లో 'పుష్ప 2' రికార్థుల మోత..!

నేషనల్ కాదు ఇంటర్నేషనల్.. హాలీవుడ్ లో ‘పుష్ప 2’ రికార్థుల మోత..!

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పుష్ప 2’. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తో భారీ కలెక్షన్స్ రాబడుతోంది. ‘పుష్ప 2’ మూవీ భారతీయ బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా అంతర్జాతీయంగా, ముఖ్యంగా ఉత్తర అమెరికాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. విశేషమేమిటంటే, ‘పుష్ప 2’ హాలీవుడ్ లో సైన్స్ ఫిక్షన్ డ్రామా ‘ఇంటర్‌స్టెల్లార్‌’ సినిమాను రి-రిలీజ్ చేసారు. అయితే ‘పుష్ప 2’ సినిమా రాంపేజ్ కలెక్షన్స్ తో ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద ‘ఇంటర్‌స్టెల్లార్‌’ కలెక్షన్స్ ను అధిగమించింది. ప్రస్తుతం ‘పుష్ప 2: ది రూల్’ సినిమా ఉత్తర అమెరికా బాక్సాఫీస్ ర్యాంకింగ్స్‌లో నాల్గవ స్థానంలో ఉంది. ఈ సినిమా 1,245 థియేటర్‌లలో $1,700,000 కలెక్షన్స్ సాధించింది. ఇంటర్‌స్టెల్లార్ 165 నుండి $1,370,000 వసూళ్లు చేసింది. ఇది భారతీయ సినిమాకి కొత్త బెంచ్‌మార్క్‌ను కూడా సెట్ చేసింది, 250 కోట్లకు పైగా అత్యధికంగా ఓపెనింగ్ డేని రికార్డ్ చేసింది, 220 కోట్లతో ప్రారంభించిన ‘RRR’ సినిమా పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. ఈ కలెక్షన్స్ తో ‘పుష్ప’ సినిమా నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని నిరూపించింది.

Recent

- Advertisment -spot_img