మీసేవ మొబైల్ యాప్ ను మంత్రి శ్రీధరబాబు ఆదివారం ప్రారంభించారు. కాగా ప్రజలు ఇంటి నుంచే పౌరసేవలు పొందేందుకు వీలుగా ప్రత్యేకంగా ‘మీసేవ యాప్’ను ఐటీశాఖ సిద్ధం చేసింది. దీని ద్వారా 150 రకాల పౌరసేవలు అందనున్నాయి. షాపింగ్మాల్స్, మెట్రో స్టేషన్లు, సమీకృత కలెక్టరేట్లు ఇతర రద్దీప్రాంతాల్లో ఇంటరాక్టివ్ కియోస్క్ ద్వారా ప్రజలు పౌరసేవలు పొందవచ్చు. దరఖాస్తులు, డిజిటల్ చెల్లింపులు, సర్టిఫికెట్ ప్రింట్ తీసుకునే అవకాశాలు కల్పిస్తున్నారు.