Homeహైదరాబాద్latest Newsఅల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపించిన అమితాబ్ బచ్చన్..! ఏమన్నారంటే..?

అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపించిన అమితాబ్ బచ్చన్..! ఏమన్నారంటే..?

ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా ‘పుష్ప 2’ మూవీ మ్యానియా నడుస్తోంది. ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే 600 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. అయితే తాజాగా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా అల్లు అర్జున్ పై ప్రశంసల వర్షం కురిపించారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో అల్లుఅర్జున్ ని మిమ్మల్ని ఎక్కువ ఇన్ స్పైర్ చేసిన యాక్టర్ ఎవరు అని అడిగారు. దానికి అల్లుఅర్జున్ .. అమితాబ్ బచ్చన్ అని బదులిచ్చాడు. అయన సినిమాలు చూస్తూ పెరిగానని, అందుకే తనకి అంత ఇష్టమని చెప్పాడు. ఈ వీడియో వైరల్ కావడంతో అమితాబ్ స్పందించారు. “అల్లు అర్జున్.. నీ మాటలు నా మనసుకు చేరాయి.. నువ్వు నన్ను అర్హతకు మించి పొగుడుతున్నావు.. నీ పనికి, నీ ప్రతిభకు మేమంతా పెద్ద ఫ్యాన్స్.. ఇకపై మీరు మమ్మల్ని ఇంకా ఇన్ స్పైర్ చేస్తూనే ఉండాలి.. మీరు ఇలానే విజయాలు సాధిస్తూ ఉండాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నాను అని అమితాబ్ బచ్చన్ ట్వీట్ వేశారు.

Recent

- Advertisment -spot_img