Homeహైదరాబాద్latest Newsమీ నిరంకుశ పాలనకు చరమగీతం పాడటం ఖాయం.. ఎమ్మెల్సీ కవిత హెచ్చరిక..!

మీ నిరంకుశ పాలనకు చరమగీతం పాడటం ఖాయం.. ఎమ్మెల్సీ కవిత హెచ్చరిక..!

ఇచ్చిన హామీలను అమలు చేయమన్నందుకు పోలీసులతో ఆడబిడ్డలను కొట్టిస్తారా అని కవిత ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగినందుకు ఆడబిడ్డలను ఖాకీలతో కాంగ్రెస్ పాలకులు కొట్టించారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది అని ఆరోపించారు. నెలకు రూ 18 వేలు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని శాంతియుతంగా నిరసన తెలియజేసిన ఆశా వర్కర్లను దారుణంగా కొడుతూ పోలీస్ వ్యాన్ లలో ఎక్కించిన తీరు.. ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్న నిర్బంధాలు, అణచివేతకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంది అని అన్నారు. ఇదేనా తెలంగాణ ఆడబిడ్డలకు సోనియా గాంధీ బర్త్ డే గిఫ్ట్ ? అని కవిత ప్రశ్నించారు. ఇదేనా ప్రజా పాలన అంటే? అని నిలదీశారు. అధికారం శాశ్వతం కాదు. చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తితో, బతుకమ్మ ఆడే చేతులతోనే, ఆడబిడ్డలు కాంగ్రెస్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడటం ఖాయం అని కవిత హెచ్చరించారు.

Recent

- Advertisment -spot_img