డిజిటల్ రేషన్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
- Android వినియోగదారులు: Google Play Store నుండి మేరా రేషన్ 2.0 యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి.
- iOS వినియోగదారులు: Apple App Store నుండి మేరా రేషన్ 2.0 యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి.
- మీ స్మార్ట్‌ఫోన్‌లో మేరా రేషన్ 2.0 యాప్‌ను ఇన్స్టాల్ చేయండి.
- అప్లికేషన్ ఓపెన్ చేయండి.
- స్క్రీన్‌పై చూపిన మీ ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి.
- “ధృవీకరించు” బటన్‌ను క్లిక్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
- ఓటీపీ నమోదు చేసి, “ధృవీకరించు”పై క్లిక్ చేయండి.
- ధృవీకరణ తర్వాత, మీ డిజిటల్ రేషన్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. డౌన్లోడ్ చేయండి. ప్రింట్ చేయండి లేదా సేవ్ చేయండి.
డిజిటల్ రేషన్ కార్డ్ యొక్క ప్రయోజనాలు
- మీరు దీన్ని ఎక్కడైనా, ఎప్పుడైనా ఉపయోగించవచ్చు.
- ఫిజికల్ కార్డ్ పోతుందనే భయం ఉండదు.
- రికార్డులన్నీ డిజిటల్‌గా ఉండడంతో మోసం జరిగే అవకాశాలు తక్కువ.
- మీ ఇ-రేషన్ కార్డును ఎలా ధృవీకరించాలి.
- మీరు మీ ఇ-రేషన్ కార్డ్ సమాచారాన్ని తనిఖీ చేయాలనుకుంటే, మీ రాష్ట్ర ఆహార, ప్రజా సంక్షేమ శాఖను సందర్శించండి.