Homeహైదరాబాద్latest Newsఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు మృతి.. సైనికులకు గాయాలు

ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు మృతి.. సైనికులకు గాయాలు

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో భద్రతాసిబ్బందికి, మావోయిస్టులకు మధ్య బుధవారం ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. గంగలూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మూంగా గ్రామంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. ఈ సందర్భంగా మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో ఇద్దరు భద్రతాసిబ్బందికి గాయాలయ్యాయి. గాయపడిన సైనికులను బీజాపూర్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు.

Recent

- Advertisment -spot_img