ఎలక్ట్రిక్ వాహనాల (EV) వాడకాన్ని ప్రోత్సహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మహిళల ఆర్థిక స్వావలంబనకు సహకరించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ ఆటోల్ని కొనుగోలుచేసి డ్రైవింగ్ చేసే మహిళలకు ఆర్థిక సహకారాన్ని అందించే అంశాన్ని పరిశీలిస్తోంది. ఆటో కొనుగోలుకు అయ్యే వ్యయంలో కొంత మొత్తాన్ని భరించే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీనిపై సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.