సైబర్ మోసగాళ్లు థర్డ్‌పార్టీ పేమెంట్ యాప్‌ల ద్వారా తక్కువ మొత్తంలో నగదును ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. దాంతో డబ్బు అందుకున్నవారికి ‘మీ ఖాతాలో నగదు జమైంది. ఈ లింక్‌పై క్లిక్ చేయండి’ అంటూ మెసేజ్‌లో కింద లింక్ ఇస్తున్నారు. లింక్ క్లిక్ చేసి పొరపాటున పిన్ జనరేట్ చేస్తే బ్యాంకు ఖాతాలోని డబ్బు ట్రాన్స్ఫర్ చేసుకునేందుకు పూర్తి అనుమతి ఇచ్చినట్లవుతుందని పోలీసులు చెబుతున్నారు.