తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల(BC) యువత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ స్టడీ సర్కిల్ నిర్మాణానికి తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సిరిసిల్లలో బీసీ స్టడీ సర్కిల్ నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 11 బీసీ స్టడీ సర్కిళ్లు ఉండగా సిరిసిల్ల బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటుతో ఈ సంఖ్య 12కు చేరుకుంది. దీంతో బీసీ యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు.