ఎలక్ట్రిక్ వాహనాల (EVల) నూతన పాలసీని తీసుకువచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో అంశంపై దృష్టి సారించింది. ఎలక్ట్రిక్ ఆటోల్ని కొనుగోలుచేసి డ్రైవింగ్ చేసే మహిళలకు ఆర్థిక సహకారాన్ని అందించే అంశాన్ని పరిశీలిస్తోంది. ఆటో కొనుగోలుకు అయ్యే వ్యయంలో కొంత మొత్తాన్ని భరించే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం సీఎం దృష్టికి వెళ్లగా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.