పత్తికొండలో కిలో టమాటా ధర 50 పైసలకు పడిపోయింది. నిన్న, మొన్న ధరలు ఆశాజనకంగా ఉండడంతో మార్కెట్కు భారీగా టమాటా రావటంతో ఒక్కసారిగా ధరలు పడిపోవటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తమను ఆదుకునేందుకు చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని వాపోయారు. తెలంగాణలో దిగుబడులు అధికంగా ఉండటంతో ధరలు తగ్గాయని వ్యాపారులు తెలిపారు. ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతు బజార్లలో విక్రయించాలని కోరుతున్నారు.