ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలనను ఈ నెల 31వ తేదీ లోపు పూర్తిచేయనున్నారు. ఆ వెంటనే లబ్ధిదారుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా లబ్దిదారులను ఎంపిక చేయనున్నారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి.. క్షేత్రస్థాయిలో సర్వే చేసి.. లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. తాజాగా మంత్రి పొంగులేటి ఈ పథకంపై సమీక్ష నిర్వహించి కలెక్టర్లకు కీలక ఆదేశాలు ఇచ్చారు.