ప్రస్తుతం అంతా డిజిటల్ మయం అయింది. ఎక్కడ ఏం జరిగిన ఫోన్లోనే క్షణాల్లో తెలుసుకోవచ్చు. కానీ ఇంకా చాలా మంది న్యూస్ పేపర్స్ చూసిన తర్వాతే వార్తలను నమ్మే వారుంటారు. అయితే న్యూస్ పేపర్ చదివేటప్పుడు పేజీ కింద CMYK అనే నాలుగు రంగు చుక్కలు మనకు కనబడతాయి. అవేంటివంటే.. C అంటే సియాన్ లేదా బ్లూ అని అర్థం. M అంటే మెజెంటా(పింక్), Y అంటే పసుపు, K అంటే నలుపు. ఇవీ పేపర్ ప్రింట్ సరిగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి.