ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత సినిమాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాలు చూసి యువత చెడుదారిలో పయనిస్తోందన్నారు. సినిమాల్లో మంచి కంటే చెడునే ఎక్కువగా తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. నేటి సమాజంలో డ్రగ్స్, గంజాయి స్మగ్లింగ్ చేసేవారిని హీరోలుగా చూస్తున్నారని, అయితే ఈ సంస్కృతి పోవాలని, ఆడపిల్లలను కాపాడే వారిని హీరోలుగా చూడాలని, మగపిల్లలను సక్రమంగా పెంచితే ఈ సమస్యలన్నీ ఉండవని ఆమె అన్నారు.