ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి బలపడి వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మూడు రోజుల పాటు తమిళనాడు, ఏపీలోని కోస్తా, రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, నెల్లూరు, బాపట్ల, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకు రెయిన్ అలెర్ట్ జారీ చేసింది. బుధవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.